Medak MP : బీజేపీ చెబితేనే కవితకు బెయిల్ వచ్చిందంటున్న మూర్ఖులు

by Aamani |   ( Updated:2024-08-29 13:17:20.0  )
Medak MP : బీజేపీ చెబితేనే కవితకు బెయిల్  వచ్చిందంటున్న  మూర్ఖులు
X

దిశ, లింగాల గణపురం : కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తే భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తున్న కాంగ్రెస్ మూర్ఖులారా, కాంగ్రెస్ పార్టీలో చాలామందికి బెయిల్ లు వచ్చినయ్.. బీఆర్ఎస్ కు బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పిస్తే ఎలా వచ్చినయో చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం మండలంలోని కిష్టగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరామ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదని,మూడుసార్లు బుద్ధి చెప్పిన, జ్ఞానోదయం కాకుండా తిక్క తిక్కగా మాట్లాడుతున్నారని అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో సుమారు 15 మంది వరకు చేరారు కానీ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదన్నారు. ప్రజల ఓట్లతో గెలవని రాజ్యసభ సభ్యుడు కేశవరావు పదవికి పార్టీకి రాజీనామా చేశాడని, అలాంటప్పుడు నాలుగున్నర సంవత్సరాల పదవి కాలంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చెయ్యలేదొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే చెప్పాలన్నారు.

గుంపు మేస్తిర్లు, వేలిముద్రలు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఎంపీలను తీసుకుని వచ్చి పార్లమెంటు ముందు ధర్నా చేశారన్నారు. ఎందుకంటే లిక్కర్ కేసు తప్పని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం తప్పని, మనీష్ సుసోడియను వెంటనే విడుదల చేయాలన్నారు. అప్పుడు బీజేపీ పార్టీ గాని,సీబీఐ, సీఐడీ గాని విడుదల చేయలే, సుప్రీంకోర్టు రిలీజ్ చేసిందన్నారు. అసలు కాంగ్రెస్ నాయకులు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అన్నారు. కోర్టు అంటే విలువలేదు, ప్రజలు వేసిన ఓట్ల కువిలువలేదు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం పైన కూడా వీరికి నమ్మకం లేదు, ఇలాంటి వారు నీతులు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రకృతిని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు రమేష్, చౌదర్పల్లి సతీష్, సంపత్, సోమిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story