మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీ సక్సెస్..

by Kalyani |
మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీ సక్సెస్..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్తీ గార్డెన్స్ నిర్వహించగా గ్రాండ్ సక్సెస్ అయింది. స్థానిక ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరై విజయవంతం చేశారు. స్థానిక కౌన్సిలర్ యాళ్ల పుష్పలతరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ కవిత హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో రోడ్ల వేసేందుకు అప్పటి మంత్రి జానారెడ్డి కాళ్ళ మీద పడ్డానని, ఆ సమయంలో రూ. 2 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.

ఇప్పుడు కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. బీజేపీ పార్టీ మత కల్లోలాలు సృష్టించేందుకు యత్నం చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ చూస్తుందని బీజేపీ వాళ్ళను గ్రామాల్లో తిరుగనివ్వద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు గంగిరెద్దుల వాళ్ళ వలే తల ఊపుకుంటూ వస్తారని వాళ్ళ వల్లా ఏమి కాదని అన్నారు. బీజేపీ నేత అమిత్ షా తెలంగాణ రాష్ట్రంకు వచ్చి మాటల మూట ఇచ్చాడే తప్ప, డబ్బుల మూట ఇవ్వలేదని అన్నారు. మీరు కేసీఆర్ దింపుతాం అంటున్నారు కదా.. మీరు మమ్ములను దింపుడు కాదు మేమే ఢిల్లీలో మిమ్మల్ని దింపుతామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే 5 వేల కోట్ల పరిహారం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. భారత దేశంలో ప్రజలు కేసీఆర్ నాయక్వతంను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు కాబోతుందని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ప్రతి కుటుంబంకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు చేరాయని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని, కష్ట పడ్డ వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్ మోహన రెడ్డి, వైస్ చైర్మన్ ఫరిద్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed