స్వీట్ ముక్కతో జనగామ సీటు పంచాయితీ ఖతం

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-12 10:13:25.0  )
స్వీట్ ముక్కతో జనగామ సీటు పంచాయితీ ఖతం
X

దిశ,జనగామ: బీఆర్ఎస్ పార్టీలో జనగామ సీటుపై నెలకొన్న పంచాయితీ ఒక స్వీట్ ముక్కతో ఖతం అయిపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదురుచ్చారు. దీంతో బుధవారం జనగామలో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించి వారి ఉద్దేశించి ఒకే వేదికపై ఇద్దరు నేతలు మాట్లాడారు. ఇదే వేదికపై ముత్తిరెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మిఠాయి నోట్లో పెట్టి నన్ను రెండు పర్యాయాలు గెలిపించిన మాదిరిగానే, ఉత్సాహవంతుడైన, అంకిత బావతో పనిచేసే పల్లాను కూడా గెలిపించి మన సత్తా చాటుకోవాలని ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా అదే వేదికపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ముత్తిరెడ్డి త్యాగం చేస్తే తనకు అధిష్టానం టికెట్ ఇచ్చిందని, కాళ్లకు పాదాభివందనం చేశారు.

ఈ క్రమంలో ముత్తిరెడ్డి అడ్డుకొని, నిన్ను గెలిపించే బాధ్యత నాపై ఉంది అని భరోసా ఇచ్చాడు. ఇంకేముంది ఒక్క స్వీట్ ముక్క, హార్ట్ ఫుల్ ఆలింగనంతో అంతా సమసిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కేడర్లో ఎనలేని ఉత్సాహం కనిపించింది. దీనికి తోడు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా టికెట్ల కోసం కొట్లాటలు బీఆర్ఎస్ లో ఉండవని వారి ఐక్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈనెల 16న జరగాల్సిన ముఖ్యమంత్రి బహిరంగ సభ పై దృష్టి సారించి, కసరత్తు చేస్తుంది. కనీసం లక్ష మంది నైనా తరలించాలని పార్టీ శ్రేణులు ఉవ్విల్లురుతున్నాయి. ఈ సభతో ప్రతిపక్ష పార్టీలో వణుకు పుట్టాలని పిలుపునివ్వడం గమనార్హం. సభ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed