- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎడతెరిపి లేకుండా వర్షం.. వాగులు ఉధృతం
దిశ,బయ్యారం : అల్పపీడనం కారణంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మండలంలోని సుద్ద రేవు గ్రామం వద్ద ఆదివారం బయ్యారం పెద్ద చెరువులోకి ప్రవహించే పంది పంపుల ,మసి వాగు ,కొంగర వాగు లో వరద నీరు ఉధృతికి సుద్దరేవు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహింస్తుంది. కంబాలపల్లి నారాయణపురం ,రామచంద్రాపురం ,మిర్యాల పెంట ,లక్ష్మీ పురం గ్రామప్రజల రాక పోకలకుఅంతరాయం ఏర్పడింది .అదే విధంగా బయ్యారం నుండి మొట్ట తిమ్మాపురం గ్రామం మధ్యలో వట్టేరు వాగు ఉధృతంగా వరద నీరు రావడంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా గౌరారం నుండి మహబూబాబాద్ వెళ్లే మార్గ మధ్యలో గౌరారం కట్టు కింద లోలెవల్ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆ గ్రామ ప్రజలు బాలాజీ పేట మీదుగా ఉప్పలపాడు రోడ్డు నుండి చుట్టూ తిరిగి జిల్లా కేంద్రానికి పోవల్సి వచ్చిందని తెలిపారు.
అదేవిధంగా అల్లిగూడెం కంబాలపల్లి మధ్యలో పంది పంది పంపుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పందిపంపుల గ్రామం ,కంబాలపల్లి ,రెడ్యా తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ ముందస్థు అధికారుల హెచ్చరికలతో బయ్యారం పోలీసులు ,రెవెన్యూ అధికారులు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని వరద ఉధృతి ఉన్న వాగుల వద్ద ,వాహన రాకపోకలు లేకుండా కట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో బయ్యారం తహాశీల్దార్ బి.విజయ ,సీఐ రవికుమార్, ఎస్ ఐ తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.