- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజులుగా లాభాల్లో కొనసాగిన బెంచ్ మార్క్ సూచీలు మళ్లీ ఈ రోజు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదుడుకుల మధ్య మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 80,237.85 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 79,821.99 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 426.85 పాయింట్ల నష్టంతో 79,942 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 126 పాయింట్లు తగ్గి 24,340 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్స్యూమర్, హీరో మోటోకార్ఫ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ
నష్టపోయిన షేర్లు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా