- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలయ్య ‘NBK-109’ టైటిల్ అనౌన్స్‌మెంట్.. నాగవంశీ ఏమన్నారంటే?
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు ప్రకటిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రజెంట్ బాలయ్య, బాబీ (Bobby)కాంబోలో ‘NBK-109’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చాందిని చౌదరి(Chandini Chaudhary), బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్(Shraddha Srinath) ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. అయితే దీపావళికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని నందమూరి(Nandamuri) ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ NBK అప్డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నిజానికి బాలయ్య NBK109 సినిమా టైటిల్‌ను పండుగకు విజువల్స్‌తో అనౌన్స్ చేద్దామని అనుకున్నాము.
కానీ మాకు సీజీ వర్క్ సమయానికి పూర్తవ్వలేదు. అందుకే ఇంకాస్త సమయం పడుతుంది బాలయ్య అభిమానులు నన్ను క్షమించండి. టైటిల్‌కు విజువల్, బ్యాంగ్‌తో ఇస్తేనే బాగా హైప్ వస్తుందని బాబీ ఇంకా ప్రత్యేకంగా చేస్తున్నారు. కానీ సీజీ వర్క్ టైమ్ వల్ల లేట్ అవుతుంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పది రోజుల సీజీ వర్క్ కోసం టైమ్ కావాలి’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు నిరాశ చెందుతున్నారు.