- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Governor Jishnu Dev Verma : హనుమకొండ రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
దిశ,హనుమకొండ : హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో తల సేమియా బాధితుల కోసం తలసేమియా సెంటర్ పైన నూతనంగా నిర్మించిన తలసేమియా వార్డ్ ప్రారంభోత్సవాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిలాఫలకం ఆవిష్కరించి తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ , పి. ప్రావీణ్య కు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ & పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికి బొకే అందజేశారు. జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు బ్యాండ్ మార్చ్ తో గవర్నర్ ను స్వాగతించారు. అనంతరం రెడ్ క్రాస్ ఆవరణలో జెండా ఎగురవేసి, మొక్కను నాటారు. ఆ తర్వాత జనరిక్ మెడికల్ షాప్ సందర్శించి మందుల గురించి వివరాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. తరువాత తలసేమియా వార్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, తలసేమియా సెంటర్ ను సందర్శించి బాధితులతో మాట్లాడి పండ్లు పంపిణీ చేసి, రిబ్బన్ కట్ చేసి తలసీమియా వార్డ్ ను ప్రారంభించినారు.
అనంతరం రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్ లో రెడ్ క్రాస్ కార్యక్రమాలపై మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ డా. పి. విజయ్ చందర్ రెడ్డి హనుమకొండ రెడ్ క్రాస్ కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణలో గవర్నర్ గా వచ్చిన తర్వాత మొట్ట మొదటి అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం హన్మకొండ రెడ్ క్రాస్ తలసేమియా వార్డు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రక్త దానమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ అభ్యున్నతికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు తెలిపారు. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా బాధితులకు చేస్తున్న సేవలకు రెడ్ క్రాస్ పాలక వర్గాన్ని అభినందించారు.
అనంతరం రెడ్ క్రాస్ పాలకవర్గం శాలువా, షీల్డ్ తో ఘనంగా సత్కరించి గవర్నర్ కి కృతజ్ఞతలు తెలియ చేసారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు హ్యాండ్ పెయింటింగ్ ద్వారా వేసిన గవర్నర్ ఫోటో ను అందచేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి , హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ. వి. శ్రీనివాస రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణు గోపాల్, డాక్టర్ యం. శేషు మాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, డాక్టర్ . సంధ్యారాణి, బిళ్ళ రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, హనుమకొండ డీ ఏం & హెచ్ ఓ డాక్టర్ లలితా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వరంగల్ పబ్లిక్ స్కూల్ జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు, జీవితకాల సభ్యుడు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.