- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్బీఐ బ్యాంకులో మంటలు.. షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన రెండు కంప్యూటర్లు
దిశ, తొర్రూరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ ) బ్యాంకు లో రెండు కంప్యూటర్లలో సర్క్యూట్ వలన స్వల్ప మంటలు చెలరేగాయి. బ్యాంక్ మొత్తం పొగతో కమ్ముకు పోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బ్యాంక్ సిబ్బంది తెలిపిన కథనం ప్రకారం...ఆదివారం బ్యాంక్ కి సెలవు కాబట్టి బ్యాంక్ సిబ్బంది,బ్యాంక్ కు కావలసిన పనులు చేస్తుండగా...పైన ప్రస్తుతం బ్యాంక్ లో ఒక్క కంప్యూటర్ లో చిన్నగా పొగ రావడం మొదలై,దానితో మరో కంప్యూటర్ లో మంటలు చెలరేగాయి.
దీంతో బ్యాంక్ నుంచి భారీగా పొగ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులను సంప్రదించగా వెంటనే పోలీసులు వచ్చి మంటలు ఆర్పేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పలు సూచనలను చేశారు.ఈ మంటలలో కొన్ని ఫైల్స్,కంప్లెట్స్ బాక్స్,రెండు కంప్యూటర్లు, కొంత మేరకు ఫర్నిచర్ దగ్ధమైందని బ్యాంకు సిబ్బంది తెలిపారు.