సాగు నీళ్ల కోసం రైతుల ఆందోళన

by Aamani |
సాగు నీళ్ల కోసం రైతుల ఆందోళన
X

దిశ, పెద్దవంగర : పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు.గురువారం మండలంలోని పోచంపల్లి గ్రామ పంట పొలాల్లో నీళ్లు లేక ఎండిన పంటను చూసి ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే సాగునీరు వచ్చిందని, ఆ నీటితోనే రైతులు పంట పొలాల్లో ఎదజల్లారని అన్నారు. అనంతరం సాగునీరు లేక పంట పొలాలు బీటలు వారాయని తెలిపారు.

ఇప్పటికే రైతులు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారని, తీరా సాగు చేశాక, నీరు అందడం లేదన్నారు. పంట కాలువలు సకాలంలో నీళ్లు వదిలితే బాగుండాన్నారు ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న సుమారు 100 ఎకరాల్లో ఎక్కువమంది పేద రైతులేనని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుదాగాని మనోహర్, కుందూరు వెంకన్న, మైలపాక యాకయ్య, మైలపాక వెంకటసోములు, కుందూరు మల్లయ్య, తండాల శోభన్,వెంకన్న, ఐలుమల్లు, యాక బిక్షం, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story