- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహేందర్‌కు డాక్టరేట్
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన ఆరూరి మహేందర్ విద్యకుసుమం అంటూ పలువురు వ్వక్తం కొనియాడారు. దళిత, నిరుపేద కుటుంబం అరూరి మహేందర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. ఆస్ట్రానమీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ ఎల్లయ్య పర్యవేక్షణలో సూర్యుడి వాతావరణం నుండి వచ్చే రేడియో ఉధ్గారాల అధ్యయనం అంశంపై పీహెచ్డీ పరిశోధన పూర్తి చేశారు. మహేందర్ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మహేందర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆస్ట్రానిమీలో పీజీ పూర్తి చేసి యూనివర్సిటిలో ఆస్టానిమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ డాక్టరేట్ సాధించడంతో గ్రామ యువతి, యువకులు, ప్రజలు, కుటుంబ సభ్యులు హర్షం వ్వక్తం చేస్తున్నారు. పరిశోధనలో సహకరించిన సహచరులకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన గ్రంథం భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్ పరిశోధనలకు నాందిగా నిలుస్తుందని మహేందర్ అన్నారు.