- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీపీ కార్మికులను పర్మినెంట్ చేస్తాం.. MLA శ్రీధర్ బాబు
దిశ, కాటారం: వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పంచాయతీలలో పనిచేసే ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేస్తామని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సఫాయి కార్మికులు శ్రీధర్ బాబును కలిసి రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా పర్మినెంట్ చేయడంలేదని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పథకాలను బూచిగా చూపిస్తూ ప్రజల సంక్షేమాన్ని, కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు. పోలీస్ ఈవెంట్ పోటీలలో మరణించిన అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవడం విడ్డూరమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్ధిక సాయం అందజేసే వారమని గుర్తు చేశారు. ప్రతిభావంతులైన యువకులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలల్ల మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఈవెంట్ పోటీలో మరణించిన యువకుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా హింసకు తావు లేకుండా శాంతియుతంగా జీవనం సాగించాలని ఏసుక్రీస్తను ప్రార్థించారు.