- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి మహిళ పారిశ్రామికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే
దిశ,సంగెం : సంగెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహన్ని మహిళల ఆర్థిక సాధికారత వీహబ్ సీఈవో సీత పళచోళ్ల తో పాటు వారి బృందం గురువారం సందర్శించారు. అనంతరం శాంతి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారితకు కృషి చేస్తుందన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందుకు మహిళల భాగస్వామ్యం అవసరమని అన్నారు.
సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర మండలాలకు ఒకటి మహిళ ఆర్థిక సాధికారిక సెంటర్ కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని అడిగిన వెంటనే ఇస్తానని చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.మహిళల ఆర్థిక సాధికారత వీహబ్ సీఈవో సీత పళచోళ్ల మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా తమ సంస్థ కృషి చేస్తుందని, స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ప్రభుత్వ పరంగా మహిళలకు అందిస్తున్న పథకాల పట్ల మహిళలకు అవగాహన పెంచడంతోపాటు మార్కెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.