Pm modi: భారత డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఇమిడి ఉంది.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
Pm modi: భారత డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఇమిడి ఉంది..  ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ డీఎన్ఏలోనే ప్రజాస్వామ్య (Democracy) భావజాలం ఇమిడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) కొనియాడారు. గయానా(Guyana) పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశ పార్లమెంటులో మోడీ ప్రసంగించారు. విశ్వబంధువుగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందని తెలిపారు. శ్రీలంక(Srilanka) అయినా, మాల్దీవులైనా, ఇతర ఏ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా.. భారత్ ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసిందని గుర్తు చేశారు. నేపాల్(Nepal) నుంచి తుర్కియే, సిరియా(Siriya) వరకు ఏ దేశంలో భూకంపం వచ్చినా మొదటగా ప్రతిస్పందిస్తుందన్నారు. భారతదేశ నిర్ణయాధికారంలో మానవత్వం మొదటగా మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. సమ్మిళిత సమాజం ఏర్పడటానికి ప్రజాస్వామ్యాన్ని మించిన పెద్ద మాధ్యమం మరొకటి లేదని నొక్కి చెప్పారు.

గయానాతో భారత్‌కు లోతైన సంబంధం ఉందని చెప్పారు. ఇరు దేశాల చరిత్ర ఒకేలా ఉందని తెలిపారు. గత 200 నుండి 250 సంవత్సరాలలో, భారత్, గయానా ఏకకాలంలో బానిసత్వాన్ని. స్వాతంత్ర్య పోరాటాన్ని చూశాయన్నారు. రెండు దేశాలూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. సుమారు 180 ఏళ్ల క్రితం ఒక భారతీయుడు గయానా గడ్డపైకి వచ్చాడని అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సాన్నిహిత్యంతో నిండి ఉన్నాయన్నారు. ద్వీప దేశాలు చిన్న దేశాలుగా కాకుండా పెద్ద సముద్ర దేశాలుగా చూస్తున్నామన్నారు.

అత్యున్నత పురస్కారంతో సత్కరించిన గయానా, డొమినికా

ప్రధాని మోడీని కరేబియన్ దేశాలైన గయానా, డొమినికా దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. గయానాలోనే మోడీ ఈ రెండు అవార్డులను అందుకున్నారు. జార్జ్‌టౌన్‌లోని స్టేట్ హౌస్‌లో జరిగిన వేడుకలో డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ (Silwani burtan) ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’తో సత్కరించగా.. గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ(Irfan alee) ‘ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’తో సత్కరించారు. ఈ అవార్డులను భారత ప్రజలకు మోడీ అంకితం చేశారు.

Advertisement

Next Story