పడకేసిన పంచాయతీ పాలన.. కొరవడిన పారిశుద్ద్య పనుల పర్యవేక్షణ

by Aamani |
పడకేసిన పంచాయతీ పాలన.. కొరవడిన పారిశుద్ద్య పనుల పర్యవేక్షణ
X

దిశ,దుగ్గొండి: గ్రామాల్లో పంచాయతీ పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక ప్రణాళిక లేకపోవడం, పారిశుద్ధ్య పనులకు పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు..మాతృ శాఖకే పరిమితం

మండల పరిధిలోని 34 గ్రామ పంచాయితీలకు గాను 11 మంది అధికారులకు ఒక్కొక్కరికి మూడు నాలుగు గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారుల బాధ్యతలు ఇవ్వడం తో పని భారం ఎక్కువై గ్రామ పంచాయితీ లావైపు చుట్టపు చూపుగా చూస్తున్నారు. అందరూ మండల స్థాయి అధికారులే కాబట్టి సొంత శాఖ విధులతో పాటు ఉన్నతాధికారులు సమీక్షలు, సమావేశాలకు హాజరు కావడం వంటి బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి మాతృ శాఖకే పరిమితమై పంచాయతీ పాలనకు సరైన న్యాయం చేయలేక పోతున్నారు.

కొరవడిన పారిశుద్ద్య పనుల పర్యవేక్షణ..

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడిక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది. సైడ్ కాలువల్లో నిల్వ నీరు, ఎస్సీ కాలనిలో రోడ్లపై నిల్వ నీరు, ప్రధానంగా అంగన్వాడీ సెంటర్ 1 నందు వర్షపు నీరు నిల్వ ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మండల కేంద్రంలో 6 చేతి పంపులు రిపేరు లేక పాడైపోయి ఉండటం గమనార్హం. ఎక్కువ గ్రామాల్లో చెత్త పేరుకుపోతుంది. పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ లు చాలా చోట్ల లీకై సక్రమంగా సరఫరా జరగడం లేదు. గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు పాడై పోయినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మట్టి వల్ల డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి వస్తుంది. కొన్ని కొన్ని బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖాలలు కూడా లేవు ఇప్పటికైనా పంచాయితీల్లో సరైన పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడం తో ప్రజలు సీజనల్ వ్యాధులతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

పంచాయతీ కార్యదర్శులపై ఖర్చుల భారం

గ్రామ పంచాయతీలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాతాల్లో డబ్బులు లేక, అత్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవుతున్నారు. పైపుల లీ కేజీ మరమ్మతు, పంచా యతీ ట్రాక్టర్‌ నెలవారీ బ్యాంకు ఇన్స్టాల్మెంట్, గ్రామా ల్లో విద్యుత్‌ దీపాలు, నెలనెలా విద్యుత్‌ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. కార్యదర్శులే ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామ పంచాయతీ రూ. యాభై నుంచి రూ.2 లక్షల వరకు అప్పు చేసి చెల్లిస్తున్నారు. పంచాయతీల భారమంతా కార్యద ర్శులపైనే పడుతోంది.

ఆరు నెలల నుంచి నిధులు లేవు…: మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్

ప్రత్యేక అధికారుల పాలన నుండి గ్రామ పంచాయితీలకు ఎలాంటి నిధులు రాలేదని, మార్చి నెలలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుండి మండలంలోని కొన్ని గ్రామాల మల్టీపర్పస్ ఉద్యోగులకు 8 లక్షల నలభై వెయ్యిల రూపాయలు మాత్రమే వచ్చాయని తెలుపుతూ, పంచాయతీలలో పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షణ జరుపుతామని తెలిపారు.

దరఖాస్తు ఇచ్చిన పట్టించుకోలే.. పారిశుధ్య పనులు చేయాలి..: కొలగాని రవి,గ్రామస్తుడు

ఎండా కాలం నుండి మండల కేంద్రంలోని మా కాలనీలో బోరింగ్ రిపేరు వచ్చింది. బోరింగ్ బాగు చేయమని రెండు నెలల్లో అయిదు, ఆరు సార్లు పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో కు దరకస్తూ ఇచ్చిన కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా రిపేర్ చేయలేదు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న సైడ్ డ్రైనేజ్ లలో నిండుకొని మట్టిని, నిల్వ ఉన్న నీటినితో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేయించాలి.

Advertisement

Next Story