BREAKING: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో దంపతులపై విచక్షణారహితంగా దాడి

by Shiva |   ( Updated:2024-05-14 06:32:40.0  )
BREAKING: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో దంపతులపై విచక్షణారహితంగా దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: రోదసీలోకి మనిషి ప్రయాణించే టెక్నాలజీ వచ్చినా.. జనాల్లో మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. లేనిపోని అనుమానాలతో దేశ ఎక్కడో ఒకచోట అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే మానవత్వం మంటగలిసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండలం వేలుబెల్లిలో గ్రామానికి చెందిన యుగంధర్, రాధిక దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వారిద్దిరూ మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన లక్ష్మి‌నర్సు, కృష్ణ కొంతకాలం నుంచి వారిపై పగబట్టారు. దీంతో అదును చూసి ఇవాళ వారిద్దరిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం అవుతున్న దంపతులను స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story