సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

by Sumithra |   ( Updated:2023-10-06 09:30:42.0  )
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థిని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే బృహత్తర కార్యక్రామం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు భూపాలపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, కలెక్టర్ భవిష్ మిశ్రా శుక్రవారం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ దేశంలోనే నూతన పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందన్నారు.

కానీ బ్రేక్ ఫాస్ట్ పథకం తమిళనాడులో ముందుగా ప్రవేశపెట్టారని, ఇక్కడున్న ఐఏఎస్ బృందం తమిళనాడులో స్టడీ చేసి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం సంతోషకర విషయం అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాల రూపురేఖలు మారాయని అన్నారు. అదేవిధంగా అదనపు గదుల నిర్మాణం డిజిటల్ తరగతి గదులు ల్యాబ్లు కూడా నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story