- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Break: పేపర్ లీకేజీ కేసులో ఏ1గా బండి సంజయ్.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టులో సమర్పించారు. ఏ1గా బండి సంజయ్‌ను చేర్చారు. ఏ2గా భూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోరు సురేశ్, ఏ7గా పోరు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేరును చేర్చారు. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఎదుట హాజరుపర్చారు. కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది.
అయితే బండి సంజయ్‌ను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుపడ్డారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనంపై దాడి చేసేందుకు యత్నించారు. అటు కోర్టు ప్రాంగణంలోనూ పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు కోర్టు బయట బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.