- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఊర' చెరువు కాదు..పట్టణ చెత్తతో నిండిన చెరువు
దిశ,డోర్నకల్ : సాధారణంగా చెరువులో నీరు నిండి ఉంటుంది.. కానీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని ఊర చెరువు మాత్రం చెత్తతో నిండి చెత్త చెరువును,డంపింగ్ యార్డును తలపిస్తోంది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఊర (బతుకమ్మ) చెరువు.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలని గత ఏడాది మున్సిపాలిటీ భావించింది. మినీ ట్యాంక్ బండ్ పేరుతో రూ.5 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.ఆహ్లాదం దేవుడెరుగు! కానీ ప్రస్తుతం చెత్తా చెదారంతో "చెత్త" చెరువుగా మారిపోయింది. ఖమ్మం-మహబూబాబాద్ ప్రధాన రహదారి కావడం అటుగా వెళ్లే వాహన చోదకులు భరించలేని కంపుతో ఇబ్బంది పడుతున్నారు.పక్కనే బస్టాండ్,అగ్నిమాపక కేంద్రం, ఎంపీడీవో,ఎమ్మార్వో,ఎస్సీ బాలుర వసతి గృహాలున్నాయి.
ట్రాక్టర్లతో భవన శిథిలాలను,వాణిజ్య సమూదాయాలకు చెందిన వ్యక్తులు,వ్యర్థాలను చెరువులోనే పడేస్తున్నారు. దీంతో మురుగు నీటితో చెరువు కలుషితమవుతోంది. మత్స్యకారులు నష్టాల బారిన పడుతున్నారు.సాగునీరు.. మురుగునీరు గా మారుతుంది. అంతే కాకుండా పరిసరాల్లో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఈగలు,దోమలు,పందులు,వీధి కుక్కలకు ఆవాసంగా మారింది.చెరువులో వ్యర్థాలు పారబోస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గతంలో పక్క మండలాల నుంచి వ్యర్థాలను తెచ్చి చెరువులో పారబోసిన సందర్భాలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి చెత్తాచెదారం,వ్యర్ధాల డంపింగ్ యార్డ్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.