దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఆభరణాలు, నగదు స్వాధీనం

by Kalyani |
దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఆభరణాలు, నగదు స్వాధీనం
X

దిశ, జనగామ: పగటిపూట తాళాలు ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఇళ్లల్లో చొరబడి నగలు, ద్విచక్ర వాహనాలు దొంగిలించిన ముగ్గురు నిందితులను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జనగామ డీసీపీ సీతారాం తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముగ్గురు నిందితుల వివరాలు వెళ్లడించారు. వీరిలో సిద్దిపేట జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన మునిగండ్ల విజయ్ కుమార్, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన సామాను శివ, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన లక్క మల్ల రవి ఉన్నారు.

వీరి నుంచి మొత్తం రూ. 6.15 బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పగటిపూట ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వరంగల్ సీసీఎస్, జనగామ పోలీస్ సిబ్బంది సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇందుకు కృషిచేసిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో జనగామ ఏసీపీ కే. దేవేందర్ రెడ్డి, సీఐ ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story