- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హై లెవెల్ వంతెన నిర్మాణానికి మోక్షం.!
దిశ, మరిపెడ : "పాకురుతో పరేషాన్.. పడుతూ లేస్తూ "నరక" ప్రయాణం అంటూ మరిపెడ మండలంలోని గిరిపురం -రాంపురం రోడ్డులోని బావాజీ గూడెం వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణం జాప్యం అవుతుండడంతో నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ పాకురు ఏర్పడి ద్విచక్ర వాహానదారులు, ప్రజలు జారిపడుతూ తీవ్ర గాయాల పాలవుతున్నారని ప్రత్యేక కథనం అందించడంతోపాటు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఆర్థిక లోటు వల్ల పనులు ముందుకు సాగినప్పటికీ ప్రస్తుతం హై లెవెల్ వంతెన పనులు యుద్ధ ప్రాతిపదికన సంబంధిత గుత్తేదారుడు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బావోజి గూడెం గ్రామస్తులు కొంతమంది దిశ పత్రిక నియోజకవర్గ ఆర్.సి గుర్రం నరేష్ నీ చరవాణిలో సంప్రదించారు. మీ వార్త ఫలితం గా తాత్కాలిక పనులు జరిగినప్పటికీ నేడు పూర్తిస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయి రవాణా సాగుతుందని గుర్తు చేసుకుంటూ వార్త కథనాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.