CM Revanth Reddy : ఆస్ట్రేలియా, సింగపూర్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : ఆస్ట్రేలియా, సింగపూర్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన..అమలుపైన...రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయం(Sports University)పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) క్రీడల ప్రగతికి తీసుకుంటున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియా(Australia)లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నట్లుగా సమాచారం. పర్యటనలో భాగంగా సీఎం బృందం క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. జనవరి 16, 17తేదీల్లో రేవంత్ రెడ్డి బృందం సింగపూర్(Singapore)లో పర్యటించనుంది. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ కే.శివసేనారెడ్డిలు, అధికారులు ఆ దేశాల్లో పర్యటిస్తారు. అయితే సీఎం విదేశీ పర్యటనల తేదీలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి ఇదే నెల జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్(Switzerland Davos) వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సదస్సులో 50కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలను చాటిచెప్పడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌ సమావేశాల్లో ‘తెలంగాణ పెవీలియన్‌’ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed