- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Daaku Maharaaj: జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ 'డాకు మహారాజ్' పై నాగవంశీ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ ( Balakrishna) హీరోగా నటిస్తున్న సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). ఇది బాలయ్య సినీ కెరియర్లో 109వ చిత్రంగా మన ముందుకొస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకం పై సంయుక్తంగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో నాగవంశీ ( Naga Vamsi) మూవీ పై చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. " మీకు 'సమరసింహా రెడ్డి'సినిమాలోని పవర్‌ఫుల్ యాక్షన్ గుర్తుందా? ఆ మూవీ అప్పట్లో మాస్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఇప్పుడు 'డాకు మహారాజ్' సెకండాఫ్ లో ఒక సీక్వెన్స్ మీకు ఇంకోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తు చేస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగడం పక్కా. నేను దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, మీరు సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేసి చూడండి " అంటూ రాసుకొచ్చారు.