న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ ఇస్తే.. స్టేడియం మొత్తం కంపు కంపు చేసి వదిలేశారు

by Mahesh |   ( Updated:2025-01-01 12:49:06.0  )
న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ ఇస్తే.. స్టేడియం మొత్తం కంపు కంపు చేసి వదిలేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి రోజు వేలమంది స్థానికులు ఆ స్టేడియంలో వాకింగ్ చేస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. రోజు వారి లాగే ఈ రోజు తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన స్థానికులు తమ స్టేడియాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎక్కడ చూసినా మద్యం బాటిల్లతో స్టేడియం మొత్తం గందరగోళంగా కనిపించడంతో ఆందోళన చేందారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ మున్సిపల్ స్టేడియం(Uppal Municipal Stadium)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 31 డిసెంబర్ సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు(New Year Celebrations) నిర్వహించేందుకు సదరు నిర్వాహకులు మున్సిపల్ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకున్నారు.

అనంతరం నిన్న రాత్రి పెద్ద మొత్తంలో పార్టీ నిర్వహించిన అధికారులు.. స్టేడియం మొత్తం గందరగోళం చేశారు. ఎక్కడ చూసినా మద్యం, వాటర్ ప్యాకేట్లతో పాటు తిని పాడేసిన మాంసం ముక్కలు, ఇస్తారు ఆకులు అలాగే వదిలేసి వెళ్లారు. పార్టీ అనంతరం స్టేడియం(Stadium) మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా(without cleaning) వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ(New Year Party) నిర్వాహకుల(Managers) తీరుకు స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా ఉంటే తాము ఎలా వాకింగ్ చేసుకోవాలని అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed