కొత్త సంవత్సరంలో జైలు ఊచలు లెక్కపెట్టనున్న 619 మంది మందుబాబులు..

by Sumithra |
కొత్త సంవత్సరంలో జైలు ఊచలు లెక్కపెట్టనున్న 619 మంది మందుబాబులు..
X

దిశ, సిటీ క్రైమ్ : మద్యం సేవించి వాహనాలను నడిపినందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 619 మంది కొత్త సంవత్సరంలో కోర్టు మెట్లు ఎక్కనున్నారు. 21 - 30 సంవత్సరాల వయస్సు గల 262 మంది ట్రాఫిక్ రూల్స్ ను పాటించలేదని సమాచారం. 619 వాహనాలల్లో 526 ద్విచక్ర వాహనాదారులే ఉన్నారు. 64 మంది కారులను స్వాధీనం చేసుకుని మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరే ఏర్పాట్లను పోలీస్ లు చేశారు.

ఈ మందుబాబులు తనిఖీల్లో అత్యధికంగా బీఏసి ( బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ ) 339 వరకు వచ్చింది. కోర్టు తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపి మొదటి సారి పట్టు బడిన మందుబాబుకు రూ. 10 వేలు ఫైన్ , లేదా 6 నెలలు, 3 నెలలు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. రెండో సారి దొరికిన వారికి రూ. 15 వేలు ఫైన్, 2 ఏండ్లు జైలు ఖాయం అంటున్నారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. ట్రక్, లారీ డ్రైవర్ లు కూడా మద్యం సేవించి వాహనాలను నడపడం కొంత కలవరానికి గురి చేసింది.

Advertisement

Next Story

Most Viewed