Ram Charan: గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్

by Hamsa |   ( Updated:2025-01-02 15:33:21.0  )
Ram Charan: గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇందులో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి(Anjali), సునీల్, ప్రకాష్ రాజ్(Prakash Raj), జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ (Thaman)సంగీతం అందిస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమా భారీ అంచనాల మధ్య తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ మొదలై నాలుగేళ్లు పూర్తి కావొస్తుండటంతో మెగా అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ కొత్త సంవత్సరం సందర్భంగా ట్రైలర్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 2న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఆయన పంచె కట్టులో ఉండి కోపంగా చూస్తున్నారు.


Click Here For Tweet..

Advertisement

Next Story

Most Viewed