- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలంలో కన్న కొడుకు విగ్రహం ఏర్పాటు చేసిన తండ్రి
దిశ, కొత్తగూడ : ప్రమాదవశాత్తు మృతి చెందిన తమ కొడుకును పదేపదే గుర్తు చేసుకుంటూ, తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. నేటికి ఏడాది పూర్తి కావడం తో యువకుని తల్లిదండ్రులు తమ కొడుకు జ్ఞాపకాలు పదిలం గా ఉండాలని, నిత్యం తమ ముందు ఉండాలని భావించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించిన ఓ తండ్రి పొలంలో ఏర్పాటు చేశారు. గంగారం మండలం కొడిషలమిట్ట గ్రామానికి చెందిన ఈసాల సారయ్య కు ఇద్దరు కొడుకులు. గత ఏడాది పొలంలో నాటు వేయడం కోసం కొడుకు రాకేశ్ (25) మోటార్ బిగించి సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయాడు.
చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కొడుకు జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకొనేందుకు విగ్రహాన్ని చేయించి తన పొలంలో వేద మంత్రాల మధ్య ఆవిష్కరించాడు. తల్లిదండ్రులకు పిల్లలు తప్ప మరో ప్రపంచం ఉండదు. వారికి ప్రతిక్షణం ప్రేమాభిమానాలు పంచి ఇస్తారు. బిడ్డ ఎదుగుదలను చూసి పరవశిస్తారు. వృద్ధాప్యంలో తమను కంటికి రెప్పలా చూస్తారని భావిస్తారు. కానీ కొందరి జీవితాలను, ఆశలనూ కొన్ని అనుకోని ఘటనలు తల్లకిందులు చేస్తాయి. తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తాయి అంటూ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కన్నీరు పెడ్తు తండ్రిని అభినందించారు.