- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ రాజకీయ డ్రామా’
దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం(వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచిన సందర్భంగా నాటి విద్యార్థుల త్యాగాలు, ఉద్యమాన్ని గుర్తుచేస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మర్చిపోయారని, తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారని ఆరోపించారు.
ఎంతోమంది విద్యార్థుల ఆత్మబలిదానాలు, పోరాటాల వలన సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ పాలనపై విసుగెత్తి నేడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నిరంకుశ, కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే భావనలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం మరో పోరాటం చేద్దామని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మనమే కాపాడుకోవాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మరో పోరాటం చేద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు.