- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రజాకార్ల పాలన.. లాఠీ చార్జ్‌పై విశ్వహిందు పరిషత్ ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రజాకార్ల పరిపాలన కొనసాగుతోందని విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు విమర్శలు చేశారు. తెలంగాణలో హిందూ ఆలయాలకు రక్షణ కరువైందని అన్నారు. తమ ఆరాధ్య దైవానికి జరిగిన అపరాధాన్ని నిరసిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించడం అప్రజాస్వామికమని విమర్శలు చేశారు. కాగా ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం అత్యంత హేయమని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఉగ్రవాదులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హిందువులపై దాడులు చేయడం వారి అసమర్ధతకు నిదర్శనమని విమర్శలు చేశారు. పోలీసులు తమ శక్తిని ఉపయోగించి ఆలయంపై దాడికి ముందు మీటింగ్ పెట్టుకున్న ఉగ్రవాద శిక్షణ పొందిన 150 మందిని అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.