Ap News: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఎంపీలతో అధినేతల కీలక సూచనలు

by srinivas |
Ap News: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఎంపీలతో అధినేతల కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు(Parliament Sessions) ప్రారంభంకానున్నాయి. దీంతో ఏపీలోని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ(Tdp), జనసేన(Janasena) సైతం పార్లమెంట్ సమావేశాలపై దృష్టి సారించారు. అంతేకాదు రెండు సభల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీ ఎంపీలతో అధినేతలు భేటీ అయ్యారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఉండవల్లి నివాసంలో టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాలని సూచించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు వివరించారు.

అటు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సైతం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story