Rahul Gandhi: రాజకీయాలు పక్కనపెట్టి ఏకతాటి మీదికి రావాలి

by Mahesh Kanagandla |
Rahul Gandhi: రాజకీయాలు పక్కనపెట్టి ఏకతాటి మీదికి రావాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య(Air Pollution) తీవ్రత రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాదిలో వాయు కాలుష్యం జాతీయ అత్యయిక పరిస్థితిని(National Emergency) తలపిస్తున్నది. మన పిల్లల భవిష్యత్‌ను మింగుతున్న, పెద్దలను ఊపిరిపీల్చుకోనివ్వని ఆరోగ్య సమస్యగా మారింది. పర్యావరణ, ఆర్థిక విపత్తుగా మారి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నది. స్వచ్ఛమైన గాలి కోసం కుటుంబాలు ఆరాటపడుతున్నాయి. పర్యాటకం దెబ్బతింటున్నది. అంతర్జాతీయంగా ఢిల్లీ పేరు మసకబారుతున్నది. వందలాది కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న కాలుష్య మేఘాన్ని రూపుమాపాల్సిన అవసరమున్నది. ఇందుకు రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణలు పక్కనపెట్టి దేశమంతా ఏకతాటిమీదికి రావాలి. ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుని వాయు కాలుష్యా్న్ని శాశ్వతంగా పరిష్కరించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story