- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్లలో విద్యావిధానం నాశనమైంది.. రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్
దిశ, వరంగల్ బ్యూరో : గత ప్రభుత్వం విద్యావ్యవస్థను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో అట్టడుగున నిలిచి ఉందని రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కముషన్ జిల్లాలో చర్చా వేదికలు నిర్బహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భూపాలపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం రాష్ట్ర సమగ్ర విద్యా విధానం పై ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చా, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర విద్యా కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన విద్యావేత్తలు.
వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి సమాజంలోని భిన్న వర్గాల నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పర్యటనల్లో ప్రభుత్వ పాఠశాలలో పాటు కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్సిటీలు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో పర్యటిస్తున్నట్ల తెలిపారు. పర్యటనల ముఖ్య ఉద్దేశం ఈ రోజు విద్యా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, గత పాలకులు చేసినటువంటి అరాచకాలు వలన విద్యా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలు విద్యా విధానం నాశనమైందని తెలిపారు.
మెరుగైన విద్యా వ్యవస్థలో ర్యాంకులో అట్టడుగున రాష్ట్రం..!
మెరుగైన విద్యావ్యవస్థలో ర్యాంకులో అట్టడుగున తెలంగాణ రాష్ట్రం అట్టడుగున ఉండటం బాధాకరమని ఆకునూరి అన్నారు. దేశంలో ప్రతి రెండు మూడు సంవత్సరాలకు చేసే సర్వేలలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం పరిశీలించగా మన రాష్ట్రం ర్యాంకు విద్యా విధానంలో 32 స్థానంలో ఉందని తెలిపారు. దాన్ని బట్టి మన విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించిందని అన్నారు. మెరుగైన విధానాలను అమలు చేసేందుకు ప్రజల నుంచే సలహాలు, సూచనలు తీసుకుని ప్రణాళికను రూపొందించనుందని అన్నారు. రాష్ట్రంలో మెరుగైన విద్యావిధానాన్నిఅమలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా పర్యటిస్తూ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో గద్వాల జిల్లా చాలా వెనుకబడి ఉందని, అందుకనే అక్కడ నుండే ఈ చర్చా వేదికలు ప్రారంభించామని, తర్వాత స్థానాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకనే వెనుకబడిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలలో ఇలాంటి చర్చా వేదిక నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
విద్యా సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ రాహుల్ శర్మ..
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు జ్యోత్స్నా రెడ్డి, వెంకటేష్, విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ చర్చకు వచ్చిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని అభినందించారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానం, ప్రత్యేక దృష్టితో సమూల మార్పు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చర్చా వేదికలో ప్రత్యేక ఆకర్షణగా మహాదేవపూర్ జడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయి ప్రదీప్తిక, అన్విత మహదేవపూర్ జడ్పి ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయి ప్రదీప్తిక, అన్విత నేత్రావదానం వీక్షించిన చైర్మన్, జిల్లా కలెక్టర్, కమిటీ సభ్యులు అభినందించారు.
విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి : విద్యావేత్తలు, తల్లిదండ్రులు..
సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, వక్తలు మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల లేమి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థుల తల్లితండ్రులు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. రీడింగ్ రూములు ఏర్పాటు, డ్రిల్ పిరిడ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులచే విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఐఐటీ, జేఈఈ, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు మెటీరియల్ అందించాలని సూచించారు. వైకల్యం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక సిబ్బంది నియామకాలు చేపట్టాలని అన్నారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని తెలిపారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్ సౌకర్యాలు ఉండాలని తెలిపారు.