- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్యం హియరింగ్ క్లినిక్ సీజ్
దిశ, మేడ్చల్ బ్యూరో : ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ ను ఏర్పాటు చేసి, సరైన అర్హతలు లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తున్న సత్యం హియరింగ్ క్లినిక్ ను మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి సీజ్ చేశారు. ఉప్పల్ నాగోలు ప్రాంతంలో హన్మిరెడ్డి అనే వ్యక్తి మెడిసిన్ చదువుతూనే హియరింగ్ క్లినిక్ ఏర్పాటు చేసి అర్హత లేకుండానే యాంటీ బయాటిక్స్ మందులు ఇవ్వడం, చికిత్సలు చేస్తుండటం జరుగుతుంది.
శుక్రవారం జిల్లా వైద్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసే సందర్భంలో ఈ విషయం రూఢీ అవడంతో క్లినిక్ ను సీజ్ చేస్తున్నట్లుగా వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ టి.రఘునాథ స్వామి హెచ్చరించారు. డిప్యూటీ జిల్లా వైద్య , ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యవతి, క్లినికల్ ఎస్టాబ్లిష్ముంట్ యాక్ట్ జిల్లా ప్రోగ్రాం అధికారిణి డా.గీత ప్రసాద్, పి.శ్రీనివాస్ తదితరులు తనిఖీ చేసిన వారిలో ఉన్నారు.