CBSE Scholarship: టెన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్థినులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల..!

by Maddikunta Saikiran |
CBSE Scholarship: టెన్త్ క్లాస్  పూర్తయిన విద్యార్థినులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల..!
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులకు ఏకైక ఆడపిల్ల సంతానంగా ఉన్న ప్రతిభ గల విద్యార్థినులను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ప్రతి సంవత్సరం సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌(Single Girl Child Scholarship)ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ తాజాగా రిలీజ్ చేసింది. కాగా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు తల్లితండ్రులకు ఏకైక కూతురై(Single Daughter) ఉండాలి. అలాగే కనీసం 70 శాతం మార్కులతో సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతూ ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ.500 చొప్పున రెండేళ్ల వరకు అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు స్టైఫండ్(Stipend) అందజేస్తారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ https://cbse.gov.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 డిసెంబర్ 2024.

Advertisement

Next Story

Most Viewed