బ్రేకింగ్: గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు చింపి ఆందోళన

by Satheesh |   ( Updated:2023-10-28 12:45:42.0  )
బ్రేకింగ్: గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు చింపి ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ టికెట్ దక్కని ఆశావహుల అసంతృప్తి సెగ గాంధీభవన్‌కు తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అభిమానులు, అనుచరులు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళనకు దిగారు. శనివారం గాంధీభవన్ వద్దకు భారీగా చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున నిరసన చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ కండువాలకు నిప్పు పెట్టి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫొటోలు చించేశారు. రేవంత్ కో హఠావో అంటూ విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. గాంధీభవన్‌పై రాళ్లు విసిరారు. విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల ఆందోళనతో గాంధీభవన్ దద్దరిల్లింది. కాగా, విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ స్థానం నుండి బరిలోకి దిగాలనుకోగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్‌కు ఇచ్చింది.

Advertisement

Next Story