ర్యాగింగ్ విష సంస్కృతిని ప్రభుత్వం కట్టడి చేయాలి.. విద్యార్థి జన సమితి డిమాండ్

by Javid Pasha |
ర్యాగింగ్ విష సంస్కృతిని ప్రభుత్వం కట్టడి చేయాలి.. విద్యార్థి జన సమితి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాగింగ్ విష సంస్కృతిని ప్రభుత్వం కట్టడి చేయాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం, విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విద్యార్థి జన సమితి అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు బలైన మెడికల్ విద్యార్థిని ధరావత్ ప్రీతిది కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వల్లే ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. మెడికల్ విద్యార్థిని ధరావత్ ప్రీతి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆత్మహత్యకు కారకుడైన సీనియర్ సైఫ్, కళాశాల అధికారులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రభుత్వ అసమర్థ పరిపాలనకు నిదర్శనమని, ఇప్పటికైన వెంటనే స్పందించి ఈ సంఘటన పై ఉదాసీన వైఖరిని ప్రదర్శించిన ఎంజీఎం (వరంగల్), వైద్య శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అందరిని అరెస్టు చేసి, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి దోషులకు తొందరగా కఠిన శిక్ష పడేటట్టు చేయాలన్నారు.

Advertisement

Next Story