- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VH: దీనిపై సీబీఐ విచారణ జరగాలి.. తిరుపతి లడ్డూ అంశంపై కాంగ్రెస్ నేత వీహెచ్
దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి దగ్గర కూడా అవినీతా?, ఈ వ్యవహారంపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్స్ వాడుతున్నారని ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులో వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో స్పందించిన వీహెచ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే అపచారం తన జీవితంలో చూడలేదని, దేవుడి దగ్గర కూడా అవినీతి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వడ్డీ కాసుల వాడని, తప్పు చేసినా, అపచారం చేసినా ఏ ఒక్కరిని విడచిపెట్టడని హెచ్చరించారు. దేవుడి లడ్డూలో ఏవేవో కలిపినట్లు ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందని, దీనిపై టీడీపీ వాళ్లు కావాలనే చేశారని ఆరోపణలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ చేయాలని, కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ ఘటనపై స్పందించి, సీబీఐ విచారణకు ఆదేశించాలని వీహెచ్ కోరారు.