- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణకు రుణాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం అదే: తేల్చిచెప్పిన నిర్మలా సీతారామన్
దిశ, తెలంగాణ బ్యూరో: మోటార్లకు మీటర్లు పెట్టనందుకే.. తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని, అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని కండీషన్స్ పాటించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కండీషన్స్ పాటించకుండా అదనంగా అప్పు తెలంగాణకు ఇవ్వడం ఎలా వీలవుతుందని ఆమె ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలు కండీషన్స్ పాటించి అదనపు రుణాలు తీసుకున్నాయని ఆమె వెల్లడించారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ అవశ్యకతకు సంబంధించిన నీళ్లు, నిధులు నియామకాలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఆమె బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. పెట్టుబడులకు అనుకూలంగా రాజధానిగా ఉన్న రాష్ట్రం నేడు లోటు బడ్జెట్‌లో ఉందని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత అధ్వాన్నంగా ఉందని ఫైరయ్యారు.
పిల్లర్లు కుంగిపోవడం మామూలు విషయం కాదని ఆమె ధ్వజమెత్తారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారని, తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి ఆరు నెలల్లోనే తొలగించారని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం సాధ్యం కాదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్ధులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు. సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రి కావాలనే ప్రాంతీయ పార్టీనీ జాతీయ పార్టీగా మార్చారని పేర్కొన్నారు.