అసెంబ్లీ ఎన్నిలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు: కిషన్ రెడ్డి

by GSrikanth |
అసెంబ్లీ ఎన్నిలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని తెలిపారు. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎమ్ఐఎమ్ పార్టీ ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కార్యచరణ ఉంటుందని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీకి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో షాక్ తప్పదని హితవు పలికారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర నిధులే కేటాయించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, పనులు మాత్రం ఆ పార్టీ కార్యాలయం దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 29 వరకు యాత్రలను నిర్వహించనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తోంది. ఈ సభకు ప్రధాని మోడీని గెస్ట్‌గా రప్పించేలా ప్లాన్ చేస్తోంది.

Next Story

Most Viewed