కార్యకర్తలంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

by M.Rajitha |
కార్యకర్తలంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచనలు చేశారు. నాలాలు, డ్రైనేజీ పొంగి పొర్లుతున్నందున చిన్నారులు, వృద్ధులను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ తీవ్ర అంతరాయం కలిగిందని, నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లళ్లోకి నీళ్లు వస్తున్నాయన్నారు. కొన్ని చోట్ల చెరువులు తెగాయని, ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులంతా జాగ్రత్తగా ఉంటూ అధికారులకు సహకరిస్తూ సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Next Story

Most Viewed