Disha Effect : స్పందించిన జిల్లా అధికారులు

by Kalyani |
Disha Effect : స్పందించిన జిల్లా అధికారులు
X

దిశ, అలంపూర్ : కస్తూర్బా బాలికల పాఠశాలకు నీళ్ల సరఫరా వారం రోజులుగా లేకపోవడంతో “కష్టాల్లో కస్తూర్బా “ అనే శీర్షికకు స్పందించి జోగులాంబ గద్వాల జిల్లా GCDO (గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ...) ఫర్జానా స్పందించారు. అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు... జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో నీళ్ల సరఫరా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, పత్రికలో కథనాలు రావడంతోనే ఆమె విజిట్ చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, పాఠశాల కోసం ఏర్పాటుచేసిన బోరు మోటర్ పాఠశాలకే సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అధిక వర్షాలు కురవడం, విద్యార్థులకు సరిపడా గదులు లేక కాస్త ఇబ్బందులకు గురైన విషయం వాస్తవమే అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే స్పందిస్తామని ఆమె తెలిపారు.

కస్తూర్బా పాఠశాలకు వచ్చే నీటిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని, కొంతమంది విద్యార్థులకు అలర్జీ ఉండటంతో వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించారని ఆమె పేర్కొన్నారు. కస్తూర్బా పాఠశాలలో ఎక్కడ ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నపాటి విషయాలను పత్రికల్లో ప్రచురణ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడతారని, అందరి సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అనునిత్యం బాధ్యతగా విధులు నిర్వహించాలని కస్తూర్బా పాఠశాల ఎస్ఓ అనురాధను ఆమె హెచ్చరించారు. ఆమెతో పాటు మండల పరిషత్ అధికారి భాస్కర్, మాజీ సర్పంచ్ భర్త దామోదర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story