Public Health: పాము కాటు కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ

by S Gopi |
Public Health: పాము కాటు కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న పాము కాటు కేసులు, మరణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజారోగ్య చట్టం లేదా వర్తించే ఇతర చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పాముకాటు కేసులు, మరణాలను 'నోటిఫై చేయదగిన వ్యాధి'గా మార్చాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో (మెడికల్ కాలేజీలతో సహా) పాముకాటు కేసులు, మరణాలను నమోదు చేయడం తప్పనిసరి చేసే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాముకాటు ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యగా మారిందని, కొన్ని సందర్భాల్లో అవి మరణాలు, అనారోగ్యం, వైకల్యానికి దారి తీస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖలో తెలిపారు. పాము కాటు ఘటనల్లో ఎక్కువగా రైతులు, గిరిజనులు ఉంటున్నారని కేంద్ర పేర్కొంది. పాముకాటు ఘటనలను తగ్గించేందుకు కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి 2030 నాటికి ఇలాంటి ఘటనలను సగానికి తగ్గించేందుకు నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్నేక్‌బైట్‌ ఎన్‌వీనమింగ్‌ (ఎన్ఏపీఎస్ఈ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, దేశంలో ఏటా లక్షల సంఖ్యలో పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మరణాలు సంభవిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed