M.Ed Admission Schedule: ఎంఈడీ, ఎంపీఈడీ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-29 17:28:36.0  )
M.Ed Admission Schedule: ఎంఈడీ, ఎంపీఈడీ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంఈడీ(Med), ఎంపీఈడీ(Mped) ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ ఫైనల్ ఫేజ్(CPGET Final Phase) అడ్మిషన్ షెడ్యూల్(Admission Schedule)ను కన్వీనర్ పాండు రంగారెడ్డి(Pandu Rangareddy) శుక్రవారం రిలీజ్ చేశారు. శనివారం నుంచి ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలై డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగనుందని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చేనెల 3న చేపట్టనున్నామని, డిసెంబర్ 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ప్రొవిజినల్ అలాట్ మెంట్ లిస్ట్ ను వచ్చేనెల 5న విడుదల చేస్తామని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు డిసెంబర్ 9న సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు https://www.osmania.ac.in,https://www.ouadmissions.com, https://cpget.ouadmissions.com, https://cpget.tsche.ac.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

Advertisement

Next Story