- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maharashtra: అలకబూనిన ఏక్‌నాథ్ షిండే!
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికలు వెలువడి వారం గడుస్తున్నా సీఎం(Maharashtra CM) ఎంపిక ఇంకా తేలలేదు. ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ల మధ్య పోటీ ఉన్నదని తొలుత భావించినా.. బీజేపీ నేతకే సీఎం చాన్స్ ఉన్నదనే అభిప్రాయాలు వచ్చాయి. సీఎం ఎంపికపై భిన్నాభిప్రాయాలేమీ లేవని, ప్రధాని మోడీ, అమిత్ షాల నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఏక్‌నాథ్ షిండే కూడా ప్రకటించడంతో దాదాపు సీఎం ఎంపికకు లైన్ క్లియర్ అయిందని అంతా భావించారు. ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ తర్వాత సీఎం ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ, అలాంటిదేమీ వెలువడకపోవడంతో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదన్న సంకేతాలు వచ్చాయి. ఇంతలో అన్ని సమావేశాలు రద్దు చేసుకుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉన్నపళంగా సతారాలోని తన సొంతూరుకు వెళ్లిపోయారు. సీఎం ఎంపికపై గురువారం మహాయుతి నేతలు భేటీ కావాల్సి ఉండింది. శివసేన సమావేశం కూడా షెడ్యూల్ అయింది. కానీ, వీటన్నింటిని పక్కనపెట్టి షిండే సొంతూరుకు వెళ్లడంతో ఈ సమావేశాలు రద్దయ్యాయి. అమిత్ షా భేటీలో సీఎం పదవి బీజేపీ నాయకుడికే అనే అంశం డిసైడ్ అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏక్‌నాథ్ షిండే సీఎం సీటు కోసం అలకబూనారని, ఆయన బయటికి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా లేరని, అందుకే ఎంపికపై జాప్యం జరుగుతున్నదనే చర్చ ఊపందుకుంది. కానీ, శివసేన నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని, షిండే శనివారం తిరిగి ముంబయికి తిరిగి వస్తారని, వచ్చాక ఈ సమావేశాలు యథావిధిగా జరుగుతాయని వివరిస్తున్నారు. సీఎం సీటుపై నిర్ణయం బీజేపీదేనని తాము ఇది వరకే చెప్పామని, కాబట్టి, బంతి బీజేపీ కోర్టులో ఉన్నదని చెప్పారు. షిండే శనివారం మళ్లీ ముంబయికి తిరిగి వస్తారని, యధావిధిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. బీజేపీ ఇందుకు భిన్నంగా స్పందిస్తూ.. ఎవరి మనసూ గాయపడకుండా ప్రతి ఒక్కరినీ ఈ ప్రక్రియలో భాగస్వాములు చేసుకోవడంలో భాగంగా వ్యూహాత్మకంగానే ఈ జాప్యం జరుగుతున్నదని తెలిపారు.
వారం గడిచినా ఎమ్మెల్యేల భేటీ కాలేదు, బీజేపీపక్ష నేత ఎన్నిక జరగలేదు. ఆనవాయితీగానే ఇద్దరు కేంద్ర అబ్జర్వర్లు రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి పక్ష నేత ఎన్నిక తర్వాత గవర్నర్‌ను కలుస్తామని ఓ బీజేపీ నాయకుడు తెలిపారు. బీజేపీ నేతకే సీఎం సీటు అనేది దాదాపు ఖరారైనా.. దేవేంద్ర ఫడ్నవీస్‌కే పదవి అనేది స్పష్టంగా చెప్పలేమని ఆ నాయకుడు వివరించారు. కానీ, చాలా మంది బీజేపీ నేతలు ఆయననే కోరుకుంటున్నారని తెలిపారు.