Doctors: వైద్యులపై హింసకు సంబంధించిన సమాచారం లేదు: లోక్ సభకు తెలిపిన కేంద్రం

by vinod kumar |
Doctors: వైద్యులపై హింసకు సంబంధించిన సమాచారం లేదు: లోక్ సభకు తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో వైద్యులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన డేటా వివరాలను తాము నమోదు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది. వైద్య నిపుణులపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి ద్రవిడ మున్నేట్ర కజడం(డీఎంకే) ఎంపీ కనిమొళి కరుణానిధి (Karunanidhi) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ (Anu Priya patel) లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోని అంశాలని తెలిపారు. కాబట్టి డాక్టర్లపై దాడికి సంబంధించిన ఘటనల వివరాలను కేంద్ర ప్రభుత్వం పొందుపర్చడం లేదని పేర్కొన్నారు. వైద్య నిపుణులను రక్షించడానికి ప్రత్యేక కేంద్ర చట్టం సైతం అవసరం లేదని వెల్లడించారు. డాకర్లపై జరుగుతున్న దాడులను నియంత్రించడానికి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యుల రక్షణకు ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఆరోగ్య సంరక్షణ నిపుణులపై హింసను పరిష్కరించడానికి అనేక రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలను రూపొందించాయని తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోనూ వాటి గురించి అనేక సెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. దీనికి ప్రత్యేక కేంద్ర చట్టం అవసరం లేదని చెప్పారు.

Advertisement

Next Story