- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News:రేపు హంద్రీనీవా ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి నిమ్మల

X
దిశ, నందికొట్కూరు:నందికొట్కూరు మండలం మల్యాలకు రేపు (సెప్టెంబర్ 22న) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పరిశీలనకు వస్తున్నారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హంద్రీనీవా పథకం ప్రాజెక్టు నిర్వహణ, పనితీరును సమీక్షించనున్నారు. రైలు మార్గం లో ఉదయం డోన్ చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుని ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9 గంటలకు హంద్రీనీవా ఎత్తిపోతల పథకం చేరుకుంటారు.
Next Story