- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lebanon pager blasts: లెబనాన్ పేజర్ పేలుళ్లతో.. కేరళవాసికి లింక్..?
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన లెబనాన్ పేజర్ పేలుళ్ళ సంఘటన(Lebanon pager blasts) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పేలుళ్లకు సంబంధించిన ఘటనలో కేరళ(Kerala) రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉందన్న వార్త ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనకు సంబంధించి ప్రమేయం ఉందని భావిస్తున్న రిన్సన్ జోస్(Rinson Jose) అనే వ్యక్తిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
కేరళకు చెందిన రిన్సన్ జోస్ కు నార్వేజియన్(Norway) పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుండగా.. అతను బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ కు యజమాని అని సమాచారం. హెజ్బొల్లా జరిపిన దాడిలో వాడిన పేజర్లను సప్లై చేసిన కంపెనీ.. రిన్సన్ జోస్ కు చెందినది కావడంతోనే అతనిపై బల్గేరియా దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై.. కేరళలోని వయనాడ్ డిప్యూటీ ఎస్పీ పీఎల్ షిజు స్పందించారు. లెబనాన్ పేజర్ పేలుళ్లలో రిన్సన్ జోస్ హస్తం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అతని గురించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సంఘటనతో రిన్సన్ జోస్ సెప్టెంబర్ 17, 2024 నుంచి ఎవరికీ అందుబాటులో లేడని అతని సన్నిహితులు తెలిపారు.కాగా లెబనాన్ లో జరిగిన పేజర్ పేలుళ్లలో 12 మంది మరణించగా.. సుమారు 3,000 మందికి పైగా గాయపడ్డారు.