ఆలయానికి వెళ్లి వచ్చేలోపు అంతా దోచేశారు...

by Sridhar Babu |
ఆలయానికి వెళ్లి వచ్చేలోపు అంతా దోచేశారు...
X

దిశ, గాంధారి : ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని కమ్మరిగల్లికి చెందిన కుమ్మరి రంజిత్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వేములవాడ దర్శనానికి వెళ్లి సాయంత్రం 8 గంటలకు తిరిగి వచ్చారు. వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని సుమారు 7 తులాల బంగారు నగలు, కొంత నగదు చోరీ చేశారు. రంజిత్ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ సందర్శించి ఆధారాలు సేకరించారు. చోరీ చేసిన ప్రదేశాన్ని క్లూస్ టీం పరిశీలించింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story