Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన కళ్యాణ్ రామ్.. కారణం ఏంటంటే?

by Hamsa |
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన కళ్యాణ్ రామ్.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. దీనిని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. దీని కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు స్థాయిలో గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేవర టికెట్ పెంపునకు నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

దీనికి వెంటనే రెస్పాండ్ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దేవర టికెట్ పెంపునకు అనుమతి ఇచ్చారు. రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్‌కు 110 రూపాయలు, లోయర్ క్లాస్‌కి 60 రూపాయలు, మల్టిప్లెక్స్‌లకు 135 రూపాయల వరకు పెంచుకోడానికి అంగీకరించారు. అంతేకాకుండా బెనిఫిట్ షోలు వేయడానికి కూడా ఒప్పుకున్నారు.

దీంతో దేవర ప్రాజెక్ట్‌లో భాగం అయిన ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్‌కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. తాజాగా, కళ్యాణ్ రామ్ కూడా పవన్‌కు కృతజ్ఞతలు తెలిపుతూ X వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘మా చిత్రానికి అడిగిన వెంటనే అన్ని రకాల అనుమతులు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు.

More News : వారం రోజుల్లో 'దేవర' రిలీజ్.. పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన NTR


Next Story

Most Viewed