- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన కేంత్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: శనివారం కాంగ్రెస్ పార్టీ రైతు పండుగ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాల్లోని అమిస్తాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందని.. నమ్మకం లేని వాళ్ళు తమతో చర్చకు రావాలని.. బీఆర్ఎన్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఎవరొస్తారో రండి, విడివిడిగా అయినా.. కలిసికట్టుగా వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు చర్చలకు రావాలని.. బహిరంగ సమావేశం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా ఈ సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వీకరించారు. నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు.. 66 అబద్దాల పేరిట బీజేపీ చార్జిషీట్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం హోదాలో ఉన్న రేవంత్ తన భాషను మార్చుకుంటేనే చర్చకు వస్తానని కిషన్ రెడ్డి కండిషన్ పెట్టారు. కాగా కిషన్ రెడ్డి ప్రతి సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.