- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bandi Sanjay: కాంగ్రెస్ తీర్మానం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 23 పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిదులు ప్రకటించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు పిలుపునిచ్చింది. అనంతరం రేవంత్ సర్కార్.. తెలంగాణకు నిధులు కేటాయిస్తు కేంద్ర బడ్జెట్ ను మరోసారి ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడం చేతకాక రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చు తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ. లక్ష 9 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే ఉన్నప్పటికి.. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో పైసా ఇవ్వలేదని ఎలా అసెంబ్లీలో తీర్మానం చేస్తారని బండి ప్రశ్నించారు. విపక్షాలు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గు చేటని కేంద్ర మంత్రి బండి అభిప్రాయపడ్డారు.